తరచూ చుక్కకూరను తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను చుక్కకూర తగ్గిస్తుంది. చుక్కకూరలో ఉండే మంచి గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతాయి. దీంతో తరచూ వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. వైరస్, ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు.