- Telugu News Photo Gallery Health Benefits of Black Gram for managing diabetes, maintaining bone health Minapa Pappu Benefits
నల్లగా ఉన్నాయని విసుక్కునేరు.. ఇవి ఇనుముతో సమానం.. ఆ సమస్యలుంటే ఇట్టే మటుమాయం..
Health Benefits of Black Gram: ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేందుకు ఉత్తమమైన జీవనశైలి అవలంభించడంతోపాటు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే, ఆరోగ్యవంతంగా ఉండేందుకు మినుములు బాగా సహాయపడతాయి.. అందుకే.. మినుములు తింటే ఇనుమంత బలం చేకూరుతుంది..
Updated on: Feb 14, 2024 | 9:24 PM

Health Benefits of Black Gram: ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేందుకు ఉత్తమమైన జీవనశైలి అవలంభించడంతోపాటు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే, ఆరోగ్యవంతంగా ఉండేందుకు మినుములు బాగా సహాయపడతాయి.. అందుకే.. మినుములు తింటే ఇనుమంత బలం చేకూరుతుంది.. అని పెద్దలు చెబుతుంటారు. మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు.. అనేక రోగాల నుంచి కాపాడతాయి. మినుములు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిల్లో ఫైబర్, పొటాషియం, ఆరోగ్యకమైన కొవ్వుతోపాటు.. విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1, బీ3 తోపాటు.. కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మినుములు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

జీర్ణక్రియ: మినుములను నిత్యం ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. మినుముల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.. కావున ఇది మలబద్దకం, ఉబ్బసం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. సాధ్యమైనంతమేరకు కడుపు సమస్యలు తగ్గేలా చేస్తాయి.

డయాబెటిస్: మినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. రక్తహీనతను దూరం చేస్తుంది. అంతేకాకుండా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి.. డయాబెటిస్ సమస్య తలెత్తకుండా చేస్తాయి.

ఎముకలు: మినుముల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలు బలంగా, ధృఢంగా మారడానికి సహాయపడతాయి. ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారు వీటిని తినడం మంచింది.

మంటను తగ్గిస్తాయి: మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణాలున్నాయి. గాయాలు, నొప్పులతో బాధపడుతున్న వారికి మినుములతో తయారు చేసిన ఆహారం వడ్డిస్తే మంచిది. వీటిలోని పోషకాల వల్ల చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.

గుండెకు మేలు: మినుముల్లో గుండె జబ్బులను నివారించే గుణాలున్నాయి. పొటాషియం, పీచుపదార్థాలు గుండె సమస్యలను నివారిస్తాయి. రక్తంలో వెలువడే చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించడంతోపాటు.. రక్తపోటును నివారిస్తాయి. దీంతో హృదయ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.




