Adah Sharma: క్యూట్ క్యూట్ చిన్నది.. కేకపెట్టించింది.. అదరహో అనిపిస్తున్నా అదా శర్మ
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ అదా శర్మ. ఈ సినిమాలో చాలా క్యూట్ గా నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.
Updated on: Feb 14, 2024 | 10:49 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ అదా శర్మ. ఈ సినిమాలో చాలా క్యూట్ గా నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.

అయితే హార్ట్ ఎటాక్ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకోలేకపోయింది. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. క్షణం సినిమాలో హీరోయిన్ గా నటించిన అదా శర్మ. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించాయి. ఇక ప్రస్తుతం ఈ చిన్నది హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఇక బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది అదా శర్మ. అక్కడ కమాండొ 2 సినిమాలో నటించి మెప్పించింది. ఆతర్వాత ది కేరళ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై విమర్శలు వచినప్పటికీ సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదా శర్మ. డిఫరెంట్ ఫొటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడి ఫోటో షూట్స్ చాలా వెరైటీగా ఉంటాయి. అందాల ఆరబోతలోనూ ఈ అమ్మడు వెనకాడుగు వేయదు. తాజాగా కొబ్బరి బోండాలతో కొన్ని క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.




