మగువలకు బిగ్ షాక్.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధర!
మగువలకు బిగ్ షాక్ తగిలింది. తగ్గుతూ వస్తుంది అనుకున్న బంగారం ధర నేడు మరోసారి పెరుగుతూ బంగారం ప్రియులను నిరాశకు గురి చేసింది. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనీకి లేదు. చాలా మంది ఎక్కువగా కొనడానికి ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది.
Updated on: Jul 09, 2025 | 7:05 AM


వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా తగ్గాయి. కేజీ వెండికి ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.1,14,000కు చేరుకుంది. చెన్నైలో కిలో వెండి రూ.1,24,000, కలకత్తాలో రూ.1,14,000, హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,24,000 వద్ద కొనసాగుతుంది.

జూలై 9, 2025 మంగళ వారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,840గా ఉండగా,నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.98,850గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.90,600గా ఉండగా, నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.90,610గా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,850 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,610 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,19,800లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,850 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.90,610లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,800 లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,850, 22 క్యారెట్ల ధర రూ.90,610లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,19,800లుగా ఉంది.



