దగ్గు, జలుబుని తగ్గించేందుకు అల్లాన్ని ఎక్కువగా వంటల్లో వినియోగిస్తుంటాం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది శ్వాసకోశం నుంచి విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అల్లంలో మెగ్నీషియం, పొటాషియం, బీటా కెరోటిన్, జింక్ వంటి విటమిన్స్, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.