Coconut Water Benefits: అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శరీరం చల్ల బరిచేందుకు సాధారణంగా శీతల పానియాల వైపు మనసు మళ్లుతుంది. అయితే శీతల పానియాలు తాగేందుకు బాగానే ఉన్న ఆ తర్వాత లేనిపోని చిక్కులు తెచ్చిపెడతాయి. బదులుగా కొబ్బరి నీళ్లు తాగొచ్చు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అధిక వేడి కారణంగా శరీరం చెమట రూపంలో నీటి శాతాన్ని కోల్పోతుంది. కొన్నిసార్లు అధిక వేడిలో వాంతులు కూడా అవుతాయి..