- Telugu News Photo Gallery How to identify chemicals free mangoes? Check now, Check here is details in Telugu
Mangoes Test: కెమికల్స్ ఫ్రీ మామిడి పండ్లను ఎలా గుర్తించాలి? ఇప్పుడే చెక్ చేయండి!
మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మామిడి పండ్లకు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మరి. మామిడి పండ్లు ఈ సమ్మర్‌లో తప్ప మరే సీజన్‌లో కూడా దొరకవు. అందులోనూ సీజనల్ ఫ్రూట్ కాబట్టి.. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కల్తీ అనేది పెరిగిపోయింది. మామిడి పండ్లను కూడా కెమికల్స్ వేసి పండిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. వీటి వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు..
Updated on: Apr 18, 2024 | 2:26 PM

మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మామిడి పండ్లకు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మరి. మామిడి పండ్లు ఈ సమ్మర్‌లో తప్ప మరే సీజన్‌లో కూడా దొరకవు. అందులోనూ సీజనల్ ఫ్రూట్ కాబట్టి.. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.

అయితే ఇప్పుడు కల్తీ అనేది పెరిగిపోయింది. మామిడి పండ్లను కూడా కెమికల్స్ వేసి పండిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. వీటి వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. మరి మామిడి పండ్లను కెమికల్స్ వేసి పండించారా లేక నేచురల్‌గా ముగ్గాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మామిడి పండ్లను క్యాల్షియం కార్బైడ్ వాడుతూ ఉంటారు. ఇది మార్కెట్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతాయి. ఇలా పండిన పండ్లను తింటే డయేరియా, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు.

కాబట్టి ఈ సింపుల్ టెస్ట్‌తో చెక్ చేసేయండి. మీరు కొన్న మామిడి పండ్లను ఓ బకెట్ నీళ్లలో వేయండి. అవి పూర్తిగా మునిగాయి అంటే.. సహజంగా పండాయని అర్థం. లేదంటే కెమికల్స్ ద్వారా పండించారని తెలుసుకోవాలి.

సహజంగా పండిన మామిడి కాయలపై ఆకు పచ్చ, పసుపు పచ్చ రంగులు ఉంటాయి. పూర్తిగా ఎల్లో కలర్‌లో ఉందంటే వాటిని కెమికల్స్ ద్వారా పండించారని అర్థం చేసుకోవాలి. అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన కాయలను వెంటనే తినకూడదు. నీటిలో ఓ అరగంట పాటు నానబెట్టి.. శుభ్రం చేసి తినాలి.





























