- Telugu News Photo Gallery Follow these best tips for Nara Drishti and Kanu Drishti, Check Here is Details in Telugu
Drishti Tips: నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..
హిందూ సంప్రదాయాల్లో దిష్టికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. దిష్టి తగలడం వల్ల ఎలాంటి వారైనా త్వరగా కోలుకోలేరని అంటారు. ఎవరి దిష్టీ తమ కుటుంబ సభ్యుల మీద, ఇంటిపై పడుకుండా ఉండాలని కోరుకుంటారు. దిష్టి తగలడం వల్ల ఎంతటి వారైనా ఇబ్బందులు పడక తప్పదు..
Updated on: Dec 20, 2024 | 3:23 PM

ఎలాంటి వారిపైన దిష్టి తగిలితే వాళ్లు తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దిష్టికి ఉన్న పవర్ అలాంటిది. ముఖ్యంగా నర దిష్టి, కన్ను దిష్టి పడ్డవాళ్లు త్వరగా వృద్ధి సాధించలేరని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలాంటి నర దిష్టి, కన్ను దిష్టి మీ ఇంటిపై, మీ కుటుంబంపై పడకుండా ఉండాలంటే ఇలా చేసేయండి.

నరుడి చూపు వల్ల నాపరాళ్లే బద్దలైపోతాయన్న సామెత మీరు వినే ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్లు ఈ సామెతలు అంటూ ఉంటారు. అంత పవర్ ఉంది నర దిష్టికి.. నర దిష్టి, కన్ను దిష్టి తగులుతుందని నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు.

నర దిష్టి, కన్ను దిష్టి నుంచి తప్పించుకోవాలంటే.. ఇప్పుడ చెప్పే పవర్ ఫుల్ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజూ జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీపై, మీ ఇంటిపై పడే నర, కన్ను దిష్టులు తగ్గుతాయి.

''ఓం తత్పురుషాయ విఘ్న హే.. వక్రతుండాయ ధీమహి.. తన్నోన్ గణపతి ప్రచోదయాత్..'' ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి నర దిష్టి, కన్ను దిష్టి నుంచి అయినా మీరు తప్పించుకుంటారు.

అలాగే కను దిష్టి యంత్రాన్ని ఇంటి బయట కానీ, మీ వ్యాపారాలు జరిగే స్థలంలో అయినా గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచాలి. అలాగే పూజ గది లేదా ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా కూడా పెట్టుకోవచ్చు.




