- Telugu News Photo Gallery Cinema photos Actress Meera Jashmine School Days Photo Goes Viral In Social Media
Tollywood : తెలుగులో స్టార్ హీరోయిన్.. కుర్రకారు ఆరాధ్య దేవత.. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టండి..
సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం తెగ వైరలవుతుంది. ఇక సెలబ్రెటీల పర్సనల్ విషయాల గురించి చెప్పక్కర్లేదు. తాజాగా ఓ హీరోయిన్ స్కూల్ డేస్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టారా..?
Updated on: Dec 20, 2024 | 3:06 PM

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో ఆమె స్టార్ హీరోయిన్. రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మీరా జాస్మిన్.

ఒకప్పుడు తన అందం, నటనతో కుర్రకారు మనసులను దోచేసింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ మహారాజా రవితేజ సరసన భద్ర సినిమాలో నటించింది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా గుడుంబా శంకర్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మీరా జాస్మిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది.

అప్పట్లో వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేసే మీరా జాస్మిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.

ఇన్నాళ్లు ట్రెడిషనల్ లుక్లో కనిపించిన మీరా జాస్మిన్.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడుకు తెలుగులోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి.




