Exercise Tips: ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చుంటున్నారా? ఈ చిన్న ఎక్సర్‌సైజులు మీ సీట్లో కూర్చునే చేసేయండి..
ఈ రోజుల్లో పిల్లల నుంచి ముదుసలి వరకు అధిక శరీర బరువు సవాలుగా మారింది. ఆఫీస్‌లో ఎక్కువ సేపు కూర్చొని కుర్చీలో పనిచేసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. చాలా మందికి బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామం చేయడానికి సమయం ఉండటం లేదు. ఇక ఆఫీసులో 8-10 గంటలు కుర్చీలో కూర్చొని గడుపుతారు. ఫలితంగా, వారి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. అయితే ఆఫీసులో కుర్చీపై కూర్చొని ఈ కింది సాధారణ వ్యాయామాలు చేయడం వల్ల బరువు సులువుగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
Updated on: Mar 06, 2024 | 7:41 PM

ఆఫీసులో కుర్చీని వదిలి కుర్చీ భంగిమలో కూర్చోవాలి. అంటే నిటారుగా నిలబడి గోడ కుర్చి మాదిరి ఏ ఆధారం లేకుండా రోజుకి కనీసం 15-20 నిమిషాల పాటు ఈ భంగిమలో ఉండాలి. కొన్ని నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల దిగువ శరీర కండరాలు బలంగా మారి, కేలరీలు బర్న్ అవుతాయి.

వాల్ పుష్-అప్స్.. సాధారణ పుష్-అప్స్‌కి కొంత వైవిధ్యం వాల్ పుష్-అప్ ఉంటాయి. వీటిని మెట్ల దిగువన అడుగున నిలబడి ఛాతీకి సమాంతరంగా చేతులతో శరీరాన్ని ముందుకు వేలాడదీయాలి. ఇప్పుడు పాదాలు వేళ్లపై నొక్కిపెట్టి, శరీరాన్ని పైకి క్రిందికి కదుపుతూ పుష్-అప్స్ చేయాలి. ఇది కండరాలను బలపరుస్తుంది, పొట్ట కొవ్వును తగ్గిస్తుంది.

కుర్చీపై కూర్చొని ఒక కాలును కిందకి దింపి, మరో కాలును ముందుకు ఎత్తి.. నేలకి సమాంతరంగా ఉంచాలి. రెండు కాళ్లను ప్రత్యామ్నాయంగా కాసేపు అలా ఉంచాలి. మీరు ఇది నిలబడి కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం చీలమండలు, తుంటి కండరాలను బలోపేతం చేస్తుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తొలగించడంలో కూడా సహాయపడుతుంది. కుర్చీపై కూర్చుని, రెండు కాళ్లను నేలకి సమాంతరంగా పైకి లేపాలి. ఒక కాలును నేలపై ఉంచి, మరొక కాలును ముందుకు ఎత్తాలి. ఇలా కనీసం 15-20 సార్లు చేయడం వల్ల కాలు కండరాలు దృఢంగా తయారవుతాయి. మోకాళ్లు, తుంటి ఎముకలు ఫ్లెక్సిబుల్‌గా మారుతాయి. కేలరీలు బర్న్ అవుతాయి.

ఆఫీస్ కుర్చీపై కూర్చుని కుడిచేత్తో కుడి కాలు పట్టుకుని, ఎడమవైపు తిప్పి ఎడమచేత్తో కుర్చీ పైభాగాన్ని పట్టుకోవాలి. దీనికి వ్యతిరేక దిశలో శరీరాన్ని తిప్పాలి. ఇలా 15-20 సార్లు చేయాలి. ఇది వెనుక, నడుము కండరాలను వంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల తలెత్తే కండరాల సమస్యలు తగ్గుతాయి. ఎలివేటర్ లేదా ఎస్కలేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజూ మెట్లు ఎక్కి దిగడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అంతేకాకుండా కాళ్ల కండరాలు బలపడతాయి.