ఖర్జూరం చాలా పోషకమైన పండు. ఖర్జూరం చాలా రుచిగా ఉండటంతోపాటు.. శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా లభిస్తాయి.. కేలరీలు, ఫైబర్, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. అయితే.. ఖర్జూరంలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనిని తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ప్రతి ఒక్కరూ వాటిని తినలేరు.