Turmeric Milk: పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

పసుపు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో వైరల్ ఇన్ ఫెక్షన్ల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిటికెడు పసుపు పాలల్లో కలిపి రోజూ రాత్రి పూట తాగితే ఆరోగ్యాన్ని రక్షణ కవచంలా కాపాడుతుంది. అయితే కొందరికి మాత్రం పసుపు కలిపిన పాలు విషయంతో సమానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Srilakshmi C

|

Updated on: Jan 01, 2025 | 12:58 PM

పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పసుపును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని మన పూర్వికులు సైతం చెబుతున్నారు. కానీ అలెర్జీ సమస్యలు ఉంటే, పసుపుకు దూరంగా ఉండాలట. లేదంటే చర్మ సంబంధిత సమస్యలు, కడుపునొప్పి రావచ్చు. పసుపులో కర్కుమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

1 / 5
చలికాలంలో వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడు కోవడానికి గోల్డెన్ మిల్క్ ఎంతో ఉపయోగపడతాయి. అదేనండీ పసుపు కలిపిన పాలు. అయితే ఇవి తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

2 / 5
పసుపు కలిపిన పాలు గ్యాస్, ఉబ్బరం, అతిసారం, వికారం, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం కావచ్చు. కడుపునొప్పి లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు పసుపు కలిపిన పాలు తాగితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. పసుపు పాలు దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. మీరు ఈ లక్షణాలు ఉండే పసుపు పాలు తాగడం మానేసి, వైద్యుడిని సంప్రదించడం మంచిది

3 / 5
పసుపు పిత్తాశయ రాళ్ల సమస్యలను తీవ్రతరం చేస్తుంది. పిత్తాశయ రాళ్లు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. కాలేయ సమస్యలు ఉన్నవారికి పసుపు పాలు దానిని మరింత తీవ్రతరం చేస్తాయి. గర్భిణీ, పాలిచ్చే స్త్రీలు పసుపు సప్లిమెంట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి.

4 / 5
450 mg లేదా అంతకంటే ఎక్కువ మోతాదులో ఉన్న కర్కుమిన్ తీసుకుంటే కొందరిలో తలనొప్పి, మైకం లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి పసుపు ఆరోగ్యానికి మంచిదే. అయితే దీనిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే పైన చెప్పిన సమస్యలున్నవారు అసలు పసుపు తీసుకోకపోవడమే మంచిది.

5 / 5
Follow us