Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potatoes: ఇష్టం కదాని ఆలూ వంటలు ఎక్కువగా లాగిస్తున్నారా? కొంపకొల్లేరే..

బంగాళాదుంపలు వంటింటి రారాజు. దాదాపు ప్రతి ఇంటి వంట గదిలో ఉంటాయి. సాధారణంగా ఇవి అన్ని సీజన్లలో లభిస్తాయి. దీంతో చాలా మంది వీటిని ఎక్కువగా తింటారు. కొంతమంది బంగాళాదుంపలతో తమ అందానికి మెరుగులు దిద్దుతారు కూడా. వీటి వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో..

Srilakshmi C

|

Updated on: Mar 27, 2025 | 1:21 PM

బంగాళాదుంపలు వంటింటి రారాజు. దాదాపు ప్రతి ఇంటి వంట గదిలో ఉంటాయి. సాధారణంగా ఇవి అన్ని సీజన్లలో లభిస్తాయి. దీంతో చాలా మంది వీటిని ఎక్కువగా తింటారు. కొంతమంది బంగాళాదుంపలతో తమ అందానికి మెరుగులు దిద్దుతారు కూడా. వీటి వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కానీ ఆరోగ్య నిపుణులు ఎక్కువగా బంగాళాదుంపలు తినడం వల్ల ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బంగాళాదుంపలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కానీ వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నొప్పితో పాటు కీళ్ల నొప్పులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.

2 / 5
డయాబెటిస్ ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపలలో అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బంగాళాదుంపలు తినకూడదని అంటున్నారు.

3 / 5
బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వేయించినవి తింటూ బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

4 / 5
బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఉబ్బరం, ఆపాన వాయువుకు దారి తీస్తుంది. దీని అధిక వినియోగం పోషకాహార అసమతుల్యతకు దారితీస్తుంది. కాబట్టి బంగాళాదుంపలను వేయించడం లేదా వాటితో తయారు చేసిన చిప్స్ తినడం మంచిది కాదు. అధిక రక్తపోటు, డయాబెటిస్, బిపి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే చాలా మంచిది.

5 / 5
Follow us