- Telugu News Photo Gallery Dry Fruits for Weight Loss: Eating These Dry Fruits Can Help You Lose Weight In Winter
Dry Fruits for Weight Loss: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కూడా సులువుగా బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే
నేటి జీవన శైలి కారణంగా తినే ఆహారం, వ్యాయామం సరిగ్గా ఉంటేనే బరువు తగ్గుతారు. కొంత మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు అంతగా తగ్గినట్లు అనిపించదు. అలాంటి వాల్లు డ్రై ఫ్రూట్స్, నట్స్ తినడం బెటర్. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరాన్ని పోషించడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
Updated on: Dec 03, 2023 | 3:32 PM

నేటి జీవన శైలి కారణంగా తినే ఆహారం, వ్యాయామం సరిగ్గా ఉంటేనే బరువు తగ్గుతారు. కొంత మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు అంతగా తగ్గినట్లు అనిపించదు. అలాంటి వాల్లు డ్రై ఫ్రూట్స్, నట్స్ తినడం బెటర్. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరాన్ని పోషించడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Dry Fruits

బరువు తగ్గలనుకునే వారు జీడిపప్పు కూడా బేషుగ్గా తినొచ్చు. జీడిపప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుం. ఈ గింజల్లో మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వాల్‌నట్‌లలో ఉండే అసంతృప్త కొవ్వు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోదు. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంతో పాటు అనేక మార్గాల్లో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

శరీరంలో మెటబాలిక్ సిస్టం సమర్ధవంతంగా ఉన్నప్పుడే బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఆ పని పిస్తాపప్పు సమర్ధవంతంగా చేస్తుంది. పిస్తాలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంతో పాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. అలాగే ప్రతి రోజూ ఉదయాన్నే నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.





























