- Telugu News Photo Gallery Drink cherry juice for better sleep two hours before bedtime says Sleep experts
Sleeping Tips: రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? బెడ్ టైంకి 2 గంటల ముందు ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. రోజంతా పడిన కష్టం వల్ల కలిగే శ్రమను నిద్ర సమయంలో శరీరం తనకు తానే రిపేర్ చేసుకుని మళ్లీ యదార్ధ స్థితికి తీసుకువస్తుంది. అయితే నేటి జీవన శైలి కారణంగా చాలా మందికి కంటి నిద్ర కరువవుతుంది. దీంతో రాత్రిళ్లు నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్. రోజూ నిద్రకు 2 గంటల ముందు..
Updated on: Dec 18, 2024 | 9:26 PM

ఇటీవలి కాలంలో ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా, చాలా మందికి కంటికి నిద్ర కరువవుతుంది. ఆధునిక జీవన విధానం ఇందుకు ప్రధాన కారణం. ఇది మనకు నిద్రను పూర్తిగా దూరం చేసింది. దీంతో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ ప్రతి వ్యక్తికి రోజుకు సరిపడా నిద్ర చాలా అవసరం. నిద్రపోవడం ద్వారా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి.

అయితే ఇలాంటి నిద్ర సమస్యలున్న వారికి చెర్రీ పండ్లు బలేగా ఉపయోగపడతాయట. అవును.. చెర్రీస్ జ్యూస్ మంచి నిద్రకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ పరిమాణంలో చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల అది ఆరోగ్యంపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.

మెలటోనిన్ కంటెంట్ కారణంగా చెర్రీ రసం మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మెలటోనిన్‌ను సాధారణంగా 'స్లీప్ హార్మోన్' అని పిలుస్తారు. ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర లేవాలో నిర్ణయించడంలో ఇది శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ట్రిప్టోఫాన్, మెలటోనిన్ చెర్రీ రసంలో ఉండే సమ్మేళనాలు నిద్రపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడం ద్వారా శరీర సహజ నిద్ర ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. కాబట్టి, పడుకోవడానికి ఒకటి నుండి రెండు గంటల ముందు ఈ జ్యూస్ తీసుకుంటే నిద్ర హాయిగా పడుతుంది.

రాత్రి సమయంలో దీని రెగ్యులర్ వినియోగం కొద్ది రోజుల్లోనే సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది. నిద్రను ప్రోత్సహించేందుకు రోజూ గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మెలటోనిన్ ఉన్న ఆహారాలను చెర్రీ జ్యూస్‌తో పాటు సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.




