- Telugu News Photo Gallery Cinema photos Vijay Sethupathi clarifies that he is not acting in Ram Charan with Buchibabu direction movie
Vijay Sethupathi: చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్ ఏంటో తెలుసా ??
ఒన్లీ హీరో... హీరో కాకపోతే ఇంకేమీ చేయను... ఈ మాటల మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు విజయ్ సేతుపతి. నియర్ ఫ్యూచర్‌లో ఆయన్ని స్పెషల్ రోల్స్ లో చూడలేమన్నది స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న మాట. హీరోగా తమిళ్‌కే పరిమితమవుతారా? తెలుగులో కూడా యాక్ట్ చేస్తారా? రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరక్షన్‌లో ఓ సినిమా సెట్స్ మీదుంది. ఉత్తరాంధ్రలో పల్లెటూరులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో కథ నడుస్తుంది.
Updated on: Dec 18, 2024 | 9:30 PM

ఒన్లీ హీరో... హీరో కాకపోతే ఇంకేమీ చేయను... ఈ మాటల మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు విజయ్ సేతుపతి. నియర్ ఫ్యూచర్‌లో ఆయన్ని స్పెషల్ రోల్స్ లో చూడలేమన్నది స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న మాట. హీరోగా తమిళ్‌కే పరిమితమవుతారా? తెలుగులో కూడా యాక్ట్ చేస్తారా?

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరక్షన్‌లో ఓ సినిమా సెట్స్ మీదుంది. ఉత్తరాంధ్రలో పల్లెటూరులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తారన్నది ఎప్పటి నుంచో ఉన్న మాట. దాని మీదే రియాక్ట్ అయ్యారు విజయ్ సేతుపతి. సారీ బ్రో... నా దగ్గర అంత టైమ్ లేదు అని క్లారిటీ ఇచ్చేశారు.

అదేంటి అంత మాట అనేశారు.. బుచ్చిబాబు సానా కోసమైనా సినిమా చేస్తారని అనుకున్నాం కదా.. అని ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. ఎవరేమనుకున్నా సరే.. సేతుపతి తన డెసిషన్‌కి స్టిక్ ఆన్ అయి ఉన్నారనే విషయం మరోసారి ప్రూవ్ అయిందని అంటున్నారు క్రిటిక్స్

ఇకపై ఒన్లీ హీరోగానే కంటిన్యూ అవుతానని ఆల్రెడీ డిక్లేర్ చేశారు విజయ్. తెలుగులోనూ కథలు వింటున్నారట. కొన్ని కథలు బావున్నా... హీరో కేరక్టరైజేషన్ బాలేకపోవడంతో ఇప్పటిదాకా సైన్ చేయలేదట సేతుపతి. విడుదల2 ప్రమోషన్లలో ఈ విషయాన్నే చెప్పారు మక్కళ్ సెల్వన్.

రీసెంట్‌గా ఓ కథ విన్నానని, అది సెట్ అయ్యే సూచనలున్నాయని కూడా తెలుగు ఆడియన్స్ కి హింట్ ఇచ్చారు ఈ స్టార్. సో, విజయ్, ధనుష్, దుల్కర్, అజిత్‌లాగా త్వరలోనే విజయ్ సేతుపతి కూడా డైరక్ట్ తెలుగు సినిమాలో నటిస్తారన్నది ఆయన ఫ్యాన్స్ సర్కిల్స్ ని ఖుషీ చేస్తున్న విషయం.




