- Telugu News Photo Gallery Drink Bottle Gourd Juice in The Morning Know Amazing Health Benefits Sorakaya
పచ్చగా ఉందని పక్కనబెట్టేరు.. దివ్యౌషధం.. ఒక్క గ్లాస్ తాగితే ఆ సమస్యలన్నీ మటాష్
తరచుగా ప్రజలకు తమ రోజును దేనితో ప్రారంభించాలి అనే ప్రశ్న తలెత్తుతుంటుంది.. వైద్యులు కూడా ముందుగా ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తినాలని సిఫార్సు చేస్తారు. అలాంటి బెస్ట్ పానీయాలలో సొరకాయ రసం ఒకటి.. అత్యంత ఉత్తేజకరమైన పానీయాలలో ఒకటిగా సొరకాయ జ్యూస్‌ను పేర్కొంటారు.. దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగమని సిఫార్సు చేస్తారు..
Updated on: Mar 27, 2025 | 1:52 PM

సొరకాయలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీని వలన చర్మంపై మొటిమలు తగ్గుతాయి. శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ ఎంతో దోహదం చేస్తుంది. దీని వలన చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. సొరకాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వలన చర్మం హైడ్రేటెడ్‌గా, పొడిబారిపోకుండా ఉంటుంది.

గుండె ఆరోగ్యం: పోషకాలు అధికంగా ఉండే సొరకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందువల్ల, సొరకాయ రసం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Bottle Gourd Benefits

జీర్ణ ఆరోగ్యం : సొరకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీన్ని రోజూ తాగడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను నివారించవచ్చు. ఇది కడుపును సులభంగా క్లియర్ చేస్తుంది.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

సొరకాయ జ్యూస్‌తో మెటబాలిజం పై ప్రభావం పడుతుంది. దీంతో జీవక్రియ పెరగడం వల్ల కేలరీలని సులువుగా కరిగించుకోవచ్చు. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. తక్కువ ఆకలి వేస్తుంది. బరువు అదుపులో ఉంటుంది. సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. గుండె సమస్యలు రావు.

హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: సొరకాయలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ప్రతిరోజూ దీన్ని తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. (ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి)




