AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish: చేపలతో వీటిని కలిపి తింటున్నారా.. అసలు విషయం తెలిస్తే షాకే..?

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ తెలుసు. వాటిలో తక్కువ కొవ్వు, అధిక నాణ్యత గల ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే విటమిన్ డి, బి2, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే చేపలను 'సూపర్ ఫుడ్' అని పిలుస్తారు. కానీ కొన్ని పదార్థాలతో వీటిని తినకూడదు.

Krishna S
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 04, 2025 | 12:53 PM

Share
చాలా మందికి చేపలు అంటే మస్త్ ఇష్టం. చేపల కూర లేదా వేపుడు గురించి ఆలోచిస్తేనే కొందరికి నోరు ఊరుతుంది. కానీ చేపలతో కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఆహార పదార్థాలను చేపలతో కలిపి తింటే ఆసుపత్రి పాలవడం ఖాయం.

1 / 6
ఆల్కహాల్ : చేపల వేపుడుతో ఆల్కహాల్ లేదా వైన్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఈ అలవాటు కాలేయంపై అధిక ఒత్తిడి పెంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. చేపలు తిన్న తర్వాత ఆల్కహాల్ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

2 / 6
నిమ్మకాయ: మీరు చేపలతో నిమ్మకాయ లేదా ఇతర విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను కలిపి తీసుకోకూడదు. పాత లేదా నిల్వ ఉంచిన చేపలతో సిట్రస్ పండ్లను ఎక్కువ పరిమాణంలో తింటే.. ఆర్సెనిక్ లేదా చేపల పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే చాలా తక్కువ పరిమాణంలో విటమిన్ సి తీసుకోవచ్చు.

3 / 6
ఆకుకూరలు: పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను చేపలతో కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించలేదు. అంతేకాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఆకుకూరలు, చేపలు రెండూ ఆరోగ్యకరమైనవే అయినా, వాటిని వేర్వేరు సమయాల్లో తినడం మంచిది.

4 / 6
 ఫాస్ట్ ఫుడ్స్: చేపలతో పాటు వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది కడుపు సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

5 / 6
స్వీట్స్ : చేపలు తిన్న తర్వాత తీపి పదార్థాలు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, జీవక్రియ సమస్యలు, బరువు పెరగడం వంటివి కూడా జరగవచ్చు. చేపలను తేలికగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో తినడం ఉత్తమం. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చేపలను సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే చేపల వల్ల పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

6 / 6