Kitchen Hacks: వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
పచ్చి చికెన్ లో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే కడుపులో నొప్పి, విరేచనాలే కాకుండా.. తినే ఆహారాన్ని కూడా విషంగా మార్చుతుంది. కాబట్టి చికెన్ ను వండేటప్పుడు ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. చికెన్ కడిగేటప్పుడు బ్యాక్టీరియా సింక్, బట్టలు, పాత్రలు..
Updated on: Dec 12, 2023 | 8:10 AM

సాధారణంగా పచ్చి ఆహార పదార్థాలను తినే ముందు కడగడం అనేది ఎవరికైనా ఉండే అలవాటే. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను కడగడం నిజంగా ప్రమాదకరం అని తెలిస్తే మీరు ఆశ్చర్య పడిపోతారు. చికెన్ ను వంట చేసే ముందు కడిగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి చికెన్ లో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే కడుపులో నొప్పి, విరేచనాలే కాకుండా.. తినే ఆహారాన్ని కూడా విషంగా మార్చుతుంది. కాబట్టి చికెన్ ను వండేటప్పుడు ఎప్పుడూ శుభ్రం చేయకూడదు.

యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. చికెన్ కడిగేటప్పుడు బ్యాక్టీరియా సింక్, బట్టలు, పాత్రలు, చేతులకు వ్యాపిస్తుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా 50 సెంటీ మీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. చికెన్ ఎప్పుడూ వండే ముందు కడగకూడదని, వండేటప్పుడు కూడా చేతికి గ్లౌజులు వంటివి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

చికెన్ ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినేటప్పుడే ఈ బ్యాక్టీరియా నశిస్తుంది. ఇదే నియమం అన్ని రకాల మాంసాహారాలకు వర్తిస్తుంది. ఒక వేళ చికెన్ ను కడగాలి అనుకుంటే మీరు.. వేడి నీరు బాగా మరిగించి అందులో ఉప్పు, పసుపు, నల్ల మిరియాలు వేయాలి. ఈ నీటిలో రెండు నిమిషాలు ఉంచి చికెన్ ను క్లీన్ చేసుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల చికెన్ లో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. చికెన్ ను శుభ్రం చేశాక మీరు కూడా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. చికెన్ ను కడగడం మీ శరీరానికి ఎందుకు ప్రమాదకరంగా ఉంటుందో.. ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి.. సరైన ఉష్ణోగ్రత వద్ద చికెన్ ని వండాలి.




