- Telugu News Photo Gallery Do you know what happens when you eat curd with chicken and mutton? Check Here is Details
Curd: చికెన్, మటన్‌తో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో భోజనం చివరలో పెరుగుతో అన్నం తినకపోతే తిన్న అనుభూతి కలగదు. వివిధ రకాల వంటల్లో కూడా పెరుగును ఉపయోగిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు తినడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. ఒత్తిడి, ఆందోళన అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇమ్యూనిటీని పెంచడంలో పెరుగు ఎంతో..
Updated on: Sep 21, 2024 | 5:05 PM

భారతీయ సంప్రదాయంలో భోజనం చివరలో పెరుగుతో అన్నం తినకపోతే తిన్న అనుభూతి కలగదు. వివిధ రకాల వంటల్లో కూడా పెరుగును ఉపయోగిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇన్నీ కావు.

పెరుగు తినడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. ఒత్తిడి, ఆందోళన అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇమ్యూనిటీని పెంచడంలో పెరుగు ఎంతో చక్కగా సహాయ పడుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలతో కలిపి పెరుగును తినకూడదట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లను పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో నొప్పి, అజీర్తి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అరటి పండ్లు తినేటప్పుడు కూడా పెరుగును తినకూడదట. పెరుగు అన్నంతో కూడా కలిపి అరంటి పండ్లను తింటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ శక్తి అనేది మందగిస్తుంది.

చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారాలు తిన్న తర్వాత వేడి చేస్తుందని చాలా మంది పెరుగును తింటారు. కానీ మాంసాహార పదార్థాలు తిన్న తర్వాత పెరుగును అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు అనేవి తలెత్తుతాయి. కడుపులో నొప్పి, అజీర్తి సమస్యలు వస్తాయి.

కీర దోశ, గింజలు, జున్న, వేయించిన ఆహారాలతో కూడా పెరుగును ఎట్టి పరిస్థితిలో కూడా తినకూడదు. ఈ రెండూ కలిపి తింటే చలువ చేసి జలుబు చేస్తుంది. సైనస్, దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




