- Telugu News Photo Gallery Do you get headaches more often? These diseases can be, Check Here is Details
Headache Causes: తలనొప్పి ఎక్కువ సార్లు వస్తుందా.. ఈ వ్యాధులు కావచ్చు జాగ్రత్త!
తలనొప్పే కదా అని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. తలనొప్పి మీకు ఎక్కువ సార్లు వస్తుందంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. తలనొప్పి ఎక్కువ సార్లు వస్తూ ఉంటే మాత్రం ఈ సమస్యల వల్లే అని తెలుసుకోండి..
Updated on: Dec 07, 2024 | 3:10 PM

తలనొప్పి రావడం అనేది సర్వ సాధారణం. అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. తల నొప్పి కారణంగా ఎలాంటి పని మీద కూడా శ్రద్ధ ఉండదు. బ్రెయిన్ సరిగా పని చేయదు. ఏ పని మీద కూడా ధ్యాస ఉండదు. తలనొప్పి అప్పుడప్పుడు కాకుండా.. ఎక్కువగా వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే.

తొలనొప్పి రావడానికి చిన్న కారణాలను కూడా అస్సలు వదలకూడదు. తలనొప్పితో పాటు ఇతర లక్షణాలు ఉంటే మాత్రం ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.

డీహైడ్రేషన్, ఆకలి, నిద్ర లేమి సమస్యలు, వర్క్ ప్రెజర్, ఆర్థిక సమస్యలు, ఒత్తిడి వంటివి అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌కి గురై తలనొప్పి వస్తుంది.

హార్మోన్ల మార్పుల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. వీటితో పాటు గర్భాధారణలో సమస్యలు ఉన్నప్పుడు కూడా తలనొప్పికి కారణం కావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ వలన కూడా తలనొప్పి వస్తుంది.

అంతే కాకుండా కళ్లలో, మెడల్లో ఉండే సమస్య వలన కూడా తలనొప్పి వస్తుంది. డయాబెటీస్, బీపీ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా తలనొప్పి ఎటాక్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ సార్లు తలనొప్పి వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




