- Telugu News Photo Gallery Do you dream of cleaning a house? This is what it means, check here is details in Telugu
Dream Meaning: ఇల్లు కడుతున్నట్లుగా కలలు వస్తున్నాయా.. దానికి అర్థం ఇదే!
సాధారణంగా నిద్రలో అనేక రకాలుగా కలలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు ఉంటే.. మరికొన్ని భయానక కలలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని కలలు బాగా గుర్తుకు ఉంటే.. మరికొన్ని మాత్రం అస్సలు గుర్తుండవు. కల ఏదైనా సరే దానికి అర్థం ఏంటో? ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కలలో చాలా మందికి ఇంటిని కొంటున్నట్లు, కడుతున్నట్లు కూడా వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇల్లు నిర్మాణంలో ఉన్నట్లు కల వస్తే అది శుభ సూచికంగా చెబుతారు. అంటే త్వరలో మీరు ఇంటికి సంబంధించిన..
Updated on: Apr 05, 2024 | 7:04 PM

సాధారణంగా నిద్రలో అనేక రకాలుగా కలలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు ఉంటే.. మరికొన్ని భయానక కలలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని కలలు బాగా గుర్తుకు ఉంటే.. మరికొన్ని మాత్రం అస్సలు గుర్తుండవు. కల ఏదైనా సరే దానికి అర్థం ఏంటో? ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు.

కలలో చాలా మందికి ఇంటిని కొంటున్నట్లు, కడుతున్నట్లు కూడా వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇల్లు నిర్మాణంలో ఉన్నట్లు కల వస్తే అది శుభ సూచికంగా చెబుతారు.

అంటే త్వరలో మీరు ఇంటికి సంబంధించిన శుభవార్తలను వింటారట. అలాగే కల వచ్చిన వ్యక్తికి.. మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. భవిష్యత్తు మీకు మొత్తం శుభ ప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు.

అదే విధంలో కలలో ప్లాటు కొనుగోలు చేస్తున్నట్లు వస్తే.. అది కూడా మంచి సంకేతంగానే పరిగణిస్తారు. ఈ కల వస్తే మీరు త్వరలోనే సొంత వ్యాపారం ప్రారంభిస్తారట. అలాగే భవిష్యత్తులో ఆర్థికంగా బల పడతారని అర్థం.

మరి కలలో కూలిపోతున్న, పగిలిపోయిన ఇంటిని చూస్తే మాత్రం.. దాన్ని అశుభంగా చెబుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అర్థం. మీ వ్యాపారంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బును కూడా కోల్పోవచ్చు.




