- Telugu News Photo Gallery Cinema photos Is Siddu Jonnalagadda's Swag the reason behind Tillu Square success or heroine anupama also, reason for success Telugu Heroes Photos
Tillu Square: ఆ కల్చర్ హాలీవుడ్‌లో జరుగుతుంది.! సేమ్ అలాంటి మ్యాజిక్ చేస్తున్న టిల్లు భాయ్.
డిజే టిల్లు అనేదిప్పుడు పేరు కాదు బ్రాండ్.. సింపుల్‌గా చెప్పాలంటే టిల్లు గాడి పేరు చెప్తే చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. మరి టిల్లు స్క్వేర్ విజయానికి కేవలం సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్ మాత్రమే కారణమా..? లేదంటే హీరోయిన్ల పాత్ర కూడా ఉందా..? అసలు టిల్లు సక్సెస్‌లో సిద్ధూ కాకుండా మిగిలిన వాళ్ల పాత్ర ఎంత..? కారెక్టర్‌తో లవ్‌లో పడిపోవడం.. దానికోసమే సినిమాలు చూడటం అనేది మన కల్చర్ కాదు.. అది హాలీవుడ్‌లో జరుగుతుంది.
Updated on: Apr 05, 2024 | 8:40 PM

స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్బులో చేరితే అది మ్యాటరే కాదసలు.. సెంచరీ చేయకపోతే అప్పుడు అసలు మ్యాటర్. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు.. వాళ్లకు 100 కోట్లంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సెంచరీ కొట్టినంత కష్టం.

అసలు టిల్లు సక్సెస్‌లో సిద్ధూ కాకుండా మిగిలిన వాళ్ల పాత్ర ఎంత..? కారెక్టర్‌తో లవ్‌లో పడిపోవడం.. దానికోసమే సినిమాలు చూడటం అనేది మన కల్చర్ కాదు.. అది హాలీవుడ్‌లో జరుగుతుంది.

స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్.. ఆ మ్యాన్ ఈ మ్యాన్ అంటూ కేవలం కారెక్టర్స్ కోసమే సినిమాలకు వెళ్తుంటారు ఆడియన్స్. తెలుగులో అలాంటి మ్యాజిక్ చేస్తున్నాడు టిల్లు భాయ్.

కథ ఎలా ఉన్నా.. కారెక్టరైజేషన్‌కే కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. డిజే టిల్లుతో ఫస్ట్ టైమ్ ఈ కారెక్టర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసారు సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పుడు టిల్లు స్క్వేర్‌తో అందరి బుర్రల్లోకి దూరిపోయింది.

ఈ మధ్య అలాంటి అద్భుతాలు వరసగా జరుగుతున్నాయి. అసలు 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన మీడియం రేంజ్ హీరోలెవరో చూద్దాం.. స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు.

టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లేముందే.. పోస్టర్‌పై 100 కోట్ల మార్క్ పడిపోతుంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు. కేవలం 8 మంది మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ సైతం 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టారు.

కలెక్షన్లు రావడానికి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన కారణం. ఈమె పాత్ర కూడా బాగానే పేలింది. మొత్తానికి మోసపోతూ కోట్లు కొల్లగొడుతున్నాడు టిల్లు. ఇప్పటికే 75 కోట్ల మార్క్ దాటిన టిల్లు స్క్వేర్.. 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది.




