- Telugu News Photo Gallery Do this if you want to store coriander for a long time without spoiling, check here is details in Telugu
Kitchen Hacks: కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. ఇలా చేయండి!
కొత్తి మీర గురించి సపరేట్‌గా పరిచయాలు అవసరం లేదు. కూర, వేపుడు ఏదైనా కొత్తిమీర ఖచ్చితంగా ఉండాల్సిందే. మంచి సువాసనతో పాటు రుచిగా కూడా ఉంటుంది. చివరిలో కొత్తిమీరతో చేసే గార్నిష్‌తో కర్రీ టేస్టే మారిపోతుంది. మరి ఈ కొత్తిమీర త్వరగా పాడవ్వకుండా.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కొత్తి మీర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్ మీకు బాగా సహాయ పడుతుంది. ఓ లోతైన పాత్ర..
Updated on: Feb 08, 2024 | 5:10 PM

కొత్తి మీర గురించి సపరేట్‌గా పరిచయాలు అవసరం లేదు. కూర, వేపుడు ఏదైనా కొత్తిమీర ఖచ్చితంగా ఉండాల్సిందే. మంచి సువాసనతో పాటు రుచిగా కూడా ఉంటుంది. చివరిలో కొత్తిమీరతో చేసే గార్నిష్‌తో కర్రీ టేస్టే మారిపోతుంది. మరి ఈ కొత్తిమీర త్వరగా పాడవ్వకుండా.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.

కొత్తి మీర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్ మీకు బాగా సహాయ పడుతుంది. ఓ లోతైన పాత్ర తీసుకోండి. అందులో కొత్తి మీర ఉంచి వేర్లు మునిగేంత వరకూ అందులో నీరు పోయండి. దీన్ని బయట అయినా పెట్టొచ్చు. ఫ్రిజ్‌లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది.

అలాగే కొత్తిమీరను మార్కెట్ నుంచి తీసుకు వచ్చిన తర్వాత గాలి చొరబడని కంటైనర్ లేదా కవర్‌లో కట్టి పెట్టండి. తడి లేకుండా చూసుకోండి. కొంచెం తడి ఉన్నా కొత్తి మీర కుళ్లు పోతుంది.

కొత్తిమీర త్వరగా పాడవ్వకుండా ఉండాలంటే.. వాటి వేర్లను వెంటనే కట్ చేయకూడదు. ముందు మురికి పోయేంత వరకు వేర్లను కడిగి.. ఆ తర్వాత ఆకులను కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు బాగా ఆరనివ్వాలి. కొత్తి మీర ఆరాక వేర్లను కట్ చేసి పేపర్‌లో చుట్టి పెట్టాలి.

చివరగా కొత్తి మీరను బాగా కడిగి వేర్ల వరకూ కట్ చేసి.. తడి ఆరిపోయేంత వరకూ ఆర బెట్టాలి. ఆ తర్వాతనే టిష్యూ పేర్ లేదా కంటైనర్‌లో పెడితే కుళ్లి పోకుండా ఉంటుంది.




