- Telugu News Photo Gallery Is there a lot of insect infestation in the kitchen? Check it with these tips, check details in Telugu
Kitchen Hacks: కిచెన్‌లో కీటకాల బెడద ఎక్కువైందా.. ఇలా వెళ్లగొట్టండి!
ఇంటిని, వంట గదిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా.. కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి. దీంతో మార్కెట్లో లభించే వివిధ రకాల స్ప్రేలను తీసుకొచ్చి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఎందుకంటే ఇందులో హానికర రసాయనాలను ఉపయోగిస్తారు. ఇంట్లో పిల్లలు ఉంటే వాటిని ఉపయోగించే ప్రమాదం ఉంది. కాబట్టి నేచురల్ రెమిడీస్‌తోనే ఇంట్లోకి వచ్చే కీటకాల బెడదకు చెక్ పెట్టండి. మీ ఇంట్లో మసాలా దినుసులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా..
Updated on: Feb 08, 2024 | 3:46 PM

ఇంటిని, వంట గదిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా.. కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి. దీంతో మార్కెట్లో లభించే వివిధ రకాల స్ప్రేలను తీసుకొచ్చి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఎందుకంటే ఇందులో హానికర రసాయనాలను ఉపయోగిస్తారు. ఇంట్లో పిల్లలు ఉంటే వాటిని ఉపయోగించే ప్రమాదం ఉంది. కాబట్టి నేచురల్ రెమిడీస్‌తోనే ఇంట్లోకి వచ్చే కీటకాల బెడదకు చెక్ పెట్టండి. మీ ఇంట్లో మసాలా దినుసులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. ఉపయోగాలు కూడా ఉన్నాయి.

వంటగదిలో కీటకాల బెడద పోగొట్టేందుకు లవంగాలు ఎంతో సహయ పడతాయి. కీటకాలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో లవంగాల పొడిని కొద్దిగా చల్లండి. ఆ ఘాటు వాసనకు కీటకాలు అనేవి రావు. ఈ వాసన వాటికి నచ్చదు.

బిర్యానీ ఆకులు కూడా వంట గదిలో కీటకాలను వెళ్లగొట్టేందుకు బాగా ఉపయోగ పడతాయి. కొన్ని బిర్యానీ ఆకులు తీసుకుని వాటిలో మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఇంటి మూలల్లో స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఈ వాసన కీటకాలు అనేవి ఇంట్లోకి రావు.

బేకింగ్ సోడాతో వంటగదిలో అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అదే క్రమంలో కీటకాలకు కూడా బైబై చెప్పొచ్చు. ఒక స్పూన్ బేకింగ్ సోడా నీటిలో కలిపి.. కీటకాలు ఎక్కువగా తిరిగే చోట స్ప్రే చేయండి. బేకింగ్ సోడా వాసన అవి అటు రానే రావు.

వేప లేదా పుదీనా ఆకులకు కూడా కీటకాలు రాకుండా అడ్డుకునేందుకు చక్కగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కీటకాలు తిరిగే చోట పుదీనా లేదా వేప ఆకులు పెట్టండి. ఆ వాసనకు కీటకాలు దూరంగా వెళ్లి పోతాయి.




