- Telugu News Photo Gallery Do this if there is itching and burning during periods, check here is details
Periods Care: పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి..
ప్రతీ మహిళ జీవితంలో పీరియడ్స్ అనేవి చాలా కామన్ విషయం. అయితే ఈ పీరియడ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఎవరి శరీరతత్వం, తినే ఫుడ్స్ వల్ల వారిలో అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నెలసరి ఉన్న ప్రతీ మహిళ మాత్రం.. ఖచ్చితంగా ఆ సమయంలో దురదగా, మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా పీరియడ్స్‌లో ర్యాషెస్, దురద, మంట, చికాకుగా ఉండటం చాలా మంది అనుభవించే ఉంటారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా..
Updated on: Aug 01, 2024 | 6:10 PM

ప్రతీ మహిళ జీవితంలో పీరియడ్స్ అనేవి చాలా కామన్ విషయం. అయితే ఈ పీరియడ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఎవరి శరీరతత్వం, తినే ఫుడ్స్ వల్ల వారిలో అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నెలసరి ఉన్న ప్రతీ మహిళ మాత్రం.. ఖచ్చితంగా ఆ సమయంలో దురదగా, మంటగా అనిపిస్తూ ఉంటుంది.

ఇలా పీరియడ్స్‌లో ర్యాషెస్, దురద, మంట, చికాకుగా ఉండటం చాలా మంది అనుభవించే ఉంటారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా బయట పెట్టరు. డాక్టర్లతో కూడా చెప్పరు. అలానే బాధను అనుభవిస్తారు. కానీ ఇప్పుడు మీ కోసమే మంచి చిట్కాలు తీసుకొచ్చాం.

మీకు యోని, యోని చుట్టు ఉన్న ప్రదేశంలో పైన చెప్పిన సమస్యలు ఉంటే కొబ్బరి నూనె రాసుకోవచ్చు. గంటకు ఓ సారి రాసుకోవడం వల్ల మంచి దురద, చికాకు, మంట, ఒరిసి పోవడం తగ్గుతుంది. ఇందులో పసుపు, టీట్రీ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ కూడా కలిపి రాసుకోవచ్చు.

అదే విధంగా పెట్రోలియం జెల్లీ అంటే వాజెలీన్ రాసుకున్నా హాయిగా అనిపిస్తుంది. అదే విధంగా అలొవెరా జెల్ ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. వేడి నీళ్లు కాకుండా చన్నీళ్లు ఉపయోగించడం బెటర్.

అలాగే మీకు పీరియడ్స్ సమయంలో ఇలా అనిపిస్తే.. ప్యాడ్‌ని నాలుగు, ఐదు గంటలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. ప్యాడ్స్ ఎక్కువ సమయం ఉంచుకున్నా కూడా దురదగా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ సమయం ఉంచుకోవచ్చు.




