కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరం కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవాలుకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేటగ్రామాల భక్తులు దీక్ష లు చేపడతారు. మూడు గ్రామాల భక్తులు చేపట్టే దీక్ష లకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవ విగ్రహాలకు కంకనా ధారణ ఈ నెల 19 వ తేదీ జరుగుతుంది. కంకనాధారణ జరిగిన రోజు మొదలుకొని బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు మూడు గ్రామాల భక్తులు . కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరిణికి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం నిషేధం.