SA vs NZ: దుమ్మురేపుతోన్న ధోని నయా టీంమేట్.. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లోనూ ఖతర్నాఖే భయ్యో
Rachin Ravindra: కివీస్ తరుపున బౌలింగ్ చేసిన కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర తొలిరోజు మూడు వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ రవీంద్ర, ఆఫ్రికాకు చెందిన జుబైర్ హమ్జా (20), కీగన్ పీటర్సన్ (2), డేవిడ్ బెడింగ్‌హామ్ (39) కీలక వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర.. న్యూజిలాండ్ విజయానికి సారథిగా నిలిచాడు. రవీంద్ర తన ఇన్నింగ్స్‌లో 366 బంతులు ఎదుర్కొని 26 ఫోర్లు, 3 సిక్సర్లతో 240 పరుగులు చేశాడు. అతనితో తొలి మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసి మెరిశాడు.