- Telugu News Photo Gallery Cricket photos Ind vs Sa Johannesburg test: South Africa creates history by beating Team India at wanderers stadium; Check here to know the records
IND vs SA: విజయంతో కొత్త ఏడాదికి వెల్‌కం చెప్పిన దక్షిణాఫ్రికా.. భారత్ ఓటమితో వాండరర్స్‌లో రికార్డుల వర్షం..!
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయడంతోపాటు కొన్ని రికార్డులను కూడా సాధించింది.
Updated on: Jan 07, 2022 | 7:12 AM

జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్‌ను నమోదు చేస్తుందని భావించారు. కానీ, అది జరగలేదు. డీన్ ఎల్గర్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దక్షిణాఫ్రికా సాధించిన ఈ విజయం ఎన్నో రికార్డులను కూడా సృష్టించింది. ఆ రికార్డులేంటో ఓసారి చూద్దాం.

వాండరర్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలిసారిగా దక్షిణాఫ్రికా టీం భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ మైదానంలో భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండు గెలిచి మూడు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఆరో మ్యాచ్‌లో కూడా అలాగే అజేయ రికార్డు కొనసాగుతుందని భావించినా అది కుదరలేదు. ఆరో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యింది.

టెస్టుల్లో భారత్‌పై ఇది మూడో అత్యంత విజయవంతమైన ఛేజింగ్. ఆతిథ్య దక్షిణాఫ్రికాను గెలవడానికి భారత్ 240 పరుగులను సవాలు చేసింది. దక్షిణాఫ్రికా కంటే ముందు భారత్‌పై 240 పరుగులకు పైగా లక్ష్యాన్ని కేవలం రెండు జట్లు మాత్రమే సాధించగలిగాయి. 1977-78లో పెర్త్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 339 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. 1987-88లో ఢిల్లీలో 276 పరుగుల లక్ష్యాన్ని సాధించిన వెస్టిండీస్ టీం సాధించింది.

అదే సమయంలో, స్వదేశంలో దక్షిణాఫ్రికాకు ఇది మూడో అత్యంత విజయవంతమైన ఛేజింగ్. అంతకుముందు 2001-02లో డర్బన్‌లో ఆస్ట్రేలియాపై 335 పరుగులను ఛేదించింది. దీని తర్వాత 1905-06లో వాండరర్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీని తర్వాత భారత్‌పై 240 పరుగుల ఛేజింగ్ నిలిచింది.

దక్షిణాఫ్రికా ఈ విజయంలో ఆ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ ది కీలకపాత్ర. 96 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌పై టెస్టుల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ చేసిన రెండో అత్యధిక స్కోరు ఇది. ఇందులో, 1992-93లో డర్బన్‌లో 118 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన కెపర్ వెసెల్ తొలి స్థానంలో నిలిచాడు.





























