- Telugu News Photo Gallery Cricket photos BCCI To Monitor 30 Indian Shortlisted Players For T20 World Cup 2024
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ లిస్టులో 30 మంది ఆటగాళ్లు.. జాబితాలో రోహిత్, కోహ్లీ..
T20 World Cup 2024: బీసీసీఐ ఎంపిక చేయనున్న 25 నుంచి 30 మంది ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కూడా ఉంటాయని సమాచారం. టీ20 జట్టు ఎంపిక కోసం ఈ ఇద్దరు ప్రముఖులను కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి, కింగ్ కోహ్లి, హిట్‌మాన్ పునరాగమనాన్ని ఆశించవచ్చు.
Updated on: Jan 03, 2024 | 3:02 PM

టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ప్రారంభానికి కేవలం నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, ఈమధ్యలో టీమిండియా ముందు కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల ద్వారా టీ20 ప్రపంచకప్‌నకు బలమైన జట్టును ఏర్పాటు చేయడం కష్టం. అందుకే బీసీసీఐ ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది.

ఈ ప్లాన్ ప్రకారం వచ్చే ఐపీఎల్‌లో 25 నుంచి 30 మంది భారత ఆటగాళ్లపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచుతుంది. వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 16 మంది ఆటగాళ్లను టీ20 ప్రపంచకప్ బరిలో నిలిచే భారత జట్టును ఎంపిక చేస్తారు.

దీని ప్రకారం, T20 ప్రపంచ కప్ కోసం 25 నుంచి 30 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఈ ఆటగాళ్ల ప్రదర్శన IPL ఆధారంగా తేల్చనున్నారు. ఈసారి అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంటారని చెప్పొచ్చు.

బీసీసీఐ ఎంపిక చేయనున్న 25 నుంచి 30 మంది ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కూడా ఉంటాయని సమాచారం. టీ20 జట్టు ఎంపిక కోసం ఈ ఇద్దరు ప్రముఖులను కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి, కింగ్ కోహ్లి, హిట్‌మాన్ పునరాగమనాన్ని ఆశించవచ్చు.

ఈసారి టీ20 ప్రపంచకప్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. అంటే IPL ముగిసిన వెంటనే USA-వెస్టిండీస్‌లో T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అందువల్ల, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఐపీఎల్ ప్రదర్శనను బెంచ్‌మార్క్‌గా ఉపయోగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.




