- Telugu News Photo Gallery Cricket photos Australia Captain Pat Cummins Creates World Record in WTC against Pakistan 3rd test
AUS vs PAK: వరుసగా ‘5 వికెట్ల’తో హ్యాట్రిక్.. డబ్యూటీసీలో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా సారథి..
Australia Captain Pat Cummins: సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 313 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులు, అమీర్ జమాల్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. అలాగే, అఘా సల్మాన్ 8 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరపున కెప్టెన్ పాట్ కమిన్స్ 5 వికెట్లతో సత్తా చాటాడు.
Updated on: Jan 03, 2024 | 4:57 PM

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. తన సహచరుడు నాథన్ లియాన్ వికెట్ల రికార్డును కూడా అతడు అధిగమించడం విశేషం.

సిడ్నీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో పాట్ కమిన్స్ 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఐదు వికెట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఇంతకు ముందు ఈ ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ పేరిట ఉండేది. లియాన్ 69 టెస్టు ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 162 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

పాట్ కమిన్స్ 69 టెస్టు ఇన్నింగ్స్‌లలో మొత్తం 163 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. 57 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 148 వికెట్లు తీసిన అశ్విన్.. డబ్ల్యూటీసీ వికెట్ టేకర్ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. పాట్ కమిన్స్ భీకర ధాటికి తడబడింది. 18 ఓవర్లు బౌలింగ్ చేసిన కమిన్స్ 61 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది.




