- Telugu News Photo Gallery Coriander Health Benefits: Surprising Health Benefits Of Coriander seeds You Should Know
Coriander Water: ధనియాలు రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే..!
వంటగదిలో ఉండే వివిధ పదార్థాలతో పలు వ్యాధులకు ఉపశమనం పొందవచ్చు. ఉదాహరణకు పసుపు, జీలకర్ర, కొత్తిమీర వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో మసాలా దినుసులకు ఒక్కో రకమైన ఔషద గుణాలు ఉంటాయి. వీటిని వండి తిన్నా లేదా పచ్చిగా తిన్నా.. ఏ రూపంలో తీసుకున్న ప్రయోజనకరమే. విపరీతమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే వేసవిలో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు..
Updated on: May 08, 2024 | 2:08 PM

వంటగదిలో ఉండే వివిధ పదార్థాలతో పలు వ్యాధులకు ఉపశమనం పొందవచ్చు. ఉదాహరణకు పసుపు, జీలకర్ర, కొత్తిమీర వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో మసాలా దినుసులకు ఒక్కో రకమైన ఔషద గుణాలు ఉంటాయి. వీటిని వండి తిన్నా లేదా పచ్చిగా తిన్నా.. ఏ రూపంలో తీసుకున్న ప్రయోజనకరమే.

విపరీతమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే వేసవిలో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణ సమస్యలకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర గింజల్లో నానబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ పోషకాలతో నిండి ఉంటాయి. కొత్తిమీర గింజల్లో విటమిన్ ఎ, సి, కె ఉంటాయి. కొత్తిమీర విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

కొత్తిమీర గింజల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ కొత్తిమీర గింజల నీటిని తాగడం వలన వివిధ రకాల ఫ్లూ, అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. కొత్తిమీర గింజలు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ తొలగిపోతాయి. శరీరం డిటాక్సిఫై అవుతుంది.

చాలా మంది తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతుంటారు. కొత్తిమీర గింజలు ఇలాంటి వారికి బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కొత్తిమీర గింజల నీటిని రోజూ తీసుకోవడం వల్ల నివారించవచ్చు. కొత్తిమీర గింజల డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా 1 టీస్పూన్ కొత్తిమీర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. రుచి కోసం కొంచెం చక్కెర లేదా తేనె చేర్చుకోవచ్చు.




