- Telugu News Photo Gallery Cinema photos Young Hero Sree Vishnu Coming with om Bhim bush movie in Tollywood
Sree Vishnu: కత్తులతో కాదు కామెడీతో చంపేస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు.!
15 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చాడు.. పదేళ్ళ కిందే హీరో అయ్యాడు.. మధ్య మధ్యలో మంచి విజయాలు అందుకున్నా సరైన మార్కెట్ మాత్రం రాలేదు. కానీ కెరీర్ ఎవరికైనా రెండో ఛాన్స్ ఇస్తుంది. సక్సెస్ బాట చూపిస్తుంది.. శ్రీ విష్ణు ఇదే చేస్తున్నారిప్పుడు. తన గెలుపు ఎక్కడుందో తెలిసాక.. అస్సలు ఆగట్లేదు ఈ హీరో. లాజిక్స్ పక్కనబెట్టి.. కామెడీ వైపు అడుగులేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఖతర్నాక్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోలలో శ్రీ విష్ణు కూడా ఉంటారు.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Mar 02, 2024 | 9:45 PM

15 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చాడు.. పదేళ్ళ కిందే హీరో అయ్యాడు.. మధ్య మధ్యలో మంచి విజయాలు అందుకున్నా సరైన మార్కెట్ మాత్రం రాలేదు. కానీ కెరీర్ ఎవరికైనా రెండో ఛాన్స్ ఇస్తుంది.

సక్సెస్ బాట చూపిస్తుంది.. శ్రీ విష్ణు ఇదే చేస్తున్నారిప్పుడు. తన గెలుపు ఎక్కడుందో తెలిసాక.. అస్సలు ఆగట్లేదు ఈ హీరో. లాజిక్స్ పక్కనబెట్టి.. కామెడీ వైపు అడుగులేస్తున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఖతర్నాక్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోలలో శ్రీ విష్ణు కూడా ఉంటారు. ఎంటర్‌టైన్మెంట్ నమ్ముకున్న ప్రతీసారి ఈయన సక్సెస్ అయ్యారు.

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర ఇలా ప్రతీసారి విజయమే వరించింది. ఇక గతేడాది సామజవరగమనాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు శ్రీ విష్ణు.

సామజవరగమన తర్వాత పూర్తిగా తన ట్రాక్ మార్చుకున్నారు శ్రీ విష్ణు. ఎంటర్‌టైన్మెంట్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తన బలం అదే అని తెలిసాక అస్సలు ఆగట్లేదు ఈ హీరో.

లాజిక్స్ లేకపోయినా పర్లేదు కానీ కడుపు చెక్కలయ్యే కామెడీ ఉంటే చాలంటున్నారు శ్రీ విష్ణు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓం భీమ్ బుష్ సినిమాతో వస్తున్నారు.

హుషారు ఫేమ్ శ్రీ హర్ష తెరకెక్కిస్తున్న ఓం భీమ్ బుష్ పూర్తిగా ఫన్ ఎంటర్‌టైనర్. నో లాజిక్స్.. నో బ్రెయిన్స్.. ఓన్లీ ఫన్ అంటూ ముందుగానే చెప్పారు మేకర్స్. టీజర్ చూస్తుంటే శ్రీ విష్ణుకు మరో హిట్ పక్కా అనిపిస్తుంది.

మార్చ్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. ఇది గానీ హిట్టైతే.. శ్రీ విష్ణు మార్కెట్ మరింత పెరగడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో..?





























