Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Smartphones: ఈ స్మార్ట్‌ఫోన్స్‌తో మరింత స్మార్ట్.. రూ. 20వేల లోపు బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు

స్మార్ట్ ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? బడ్జెట్ లెవెల్లో బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో వందల రకాల బ్రాండ్లు, లక్షల రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో ది బెస్ట్ ఏంటి అంటే చెప్పడం కష్టమే. ఎవరి అవసరాలకు అనుగుణంగా, బడ్జెట్ పరిధుల మేరకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు. ఈ కథనంలో రూ. 20వేల లోపు ఉన్న బెస్ట్ ఫోన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాబితాలో వన్ ప్లస్, పోకో, ఐకూ, మోటోరోలా, ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటిల్లో హై ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.

Srinu

|

Updated on: Mar 26, 2025 | 5:00 PM

మోటోరోలా ఎడ్జ్ 50 నియో.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.4-అంగుళాల ఎల్టీపీఓ పీఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 1.5కే రిజల్యూషన్, 120హెర్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 3,000 నిట్‌ల పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా షీల్డ్ చేసి ఉంటుంది. డాల్బీ అట్మోస్-బ్యాక్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మల్టీమీడియా అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో జత చేసి ఉంటుంది. ఏఐ ఆప్టిమైజేషన్ ద్వారా మెరుగుపరచిన 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ ఎక్స్ టెన్షన్ను అందిస్తుంది. ఆండ్రాయిడ్14 పై నడుస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం, మోటో ఎడ్జ్ 50 నియో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 10ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో అధిక-నాణ్యత సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా ఉంది.

1 / 5
ఐక్యూఓ జెడ్9.. ఈ స్మార్ట్ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది శక్తివంతమైన రంగులు, ఫ్లూయిడ్ విజువల్స్‌ను అందిస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లో 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో జత చేసిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో షార్ప్ సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు ఉంటుంది.  ఆండ్రాయిడ్ వీ14 పై నడుస్తుంది.

2 / 5
పోకో ఎక్స్6 ప్రో.. ఈ స్మార్ట్ ఫోన్లో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్ఓసీతో కూడిన ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇది 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఐఆర్ బ్లాస్టర్‌తో వస్తుంది.

3 / 5
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో..  దీనిలో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోలో 6.78-అంగుళాల పెద్ద ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.  మీడియా టెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా విషయానికొస్తే, వినియోగదారులు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్, 2ఎంపీ డెప్త్ కెమెరాను కలిగి ఉంటాయి. సెల్ఫీల కోసం, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
45వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో.. దీనిలో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోలో 6.78-అంగుళాల పెద్ద ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా విషయానికొస్తే, వినియోగదారులు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్, 2ఎంపీ డెప్త్ కెమెరాను కలిగి ఉంటాయి. సెల్ఫీల కోసం, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 45వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది

4 / 5
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే, 2412 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. హెచ్డీఆర్10+ కలర్ సర్టిఫికేషన్, 10-బిట్ కలర్ డెప్త్‌కు మద్దతు ఇస్తుంది. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో 720 జీపీయూతో ప్రాససెర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ 256జీబీ మెమరీని అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతేకాక100వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో కూడిన భారీ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

5 / 5
Follow us