Lemon Tea: ఉదయాన్నే ఖాళీ పడుపుతో లెమన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?
చాయ్ .. దాదాపు ప్రతి ఒక్కరికీ ఉండే అలవాటు.. ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి టీ లేదా కప్పు కాఫీ కడుపులో పడకపోతే.. ఆ రోజు మొదలుకాదు చాలా మందికి. కొందరు ఉదయాన్నే నిద్రలేవగానే బెడ్ టీ లేదా కాఫీ తాగుతుంటారు. మరికొందరు మార్నిగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే తీసుకుంటారు. అయితే, ఇటీవలి కాలంలో పాలతో చేసిన టీ, కాఫీలను పక్కనపెట్టి, గ్రీన్ టీ, లెమన్ టీని అలవాటుగా చేసుకుంటున్నారు. టీ, కాఫీలలో ఉండే కెఫీన్ మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. కనుక వీటిని అతిగా తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ లెమన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 26, 2025 | 6:00 PM

లెమన్ టీలో ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, కాపర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజ పరుస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఈజీగా బయట పడవచ్చు. రోజూ లెమన్ టీ తాగటం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రి పూట మైండ్ ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.

మధుమేహం బాధితులకు లెమన్ టీ చక్కటి వరంలా పనిచేస్తుందని చెబుతున్నారు. లెమన్ టీ తీసుకోవడం వల్ల హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు లెమన్ టీని సేవిస్తుంటే మేలు జరుగుతుంది.

లెమన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఉదయం లెమన్ టీని బ్రేక్ ఫాస్ట్ అనంతరం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.

లెమన్‌లో అధికంగా ఉండే సిట్రిక్ యాసిడ్ లివర్‌లోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. లెమన్ టీని ఉదయం పరగడుపున కూడా సేవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. దీంతో శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. లెమన్ టీన తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

లెమన్ టీ తాగటం వల్ల మైగ్రేన్ బాధితులకు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో శరీరానికి శక్తి లభించడమే కాక మెదడు ఉత్తేజం చెందుతుంది. ఫలితంగా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక మైగ్రేన్ ఉన్నవారు లెమన్ టీని సేవిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది.





























