అయ్యో పాపం.. లవ్లీ హీరోయిన్ ఇక తెలుగులో కనిపించడం కష్టమేనా..
Rajeev
Pic credit - Instagram
శన్వి శ్రీవాత్సవ.. ఈ బ్యూటీ గుర్తుందా.? తెలుగులో కొన్ని సినిమాలే చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ఈ బ్యూటీ ఒకరు.
2012లోఆది సాయి కుమార్ నటించిన "లవ్లీ" తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ.
ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమా "అడ్డా" సినిమాలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కన్నడ చిత్రాలైన "మాస్టర్‌పీస్" , "తారక్" , "ముఫ్తి" ,"అవనే శ్రీమన్నారాయణ" వంటి విజయవంతమైన సినిమాలలో నటించింది.
ఈ చిత్రాలలో ఆమె నటనకు గాను ఆమె SIIMA క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ) , SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ) వంటి పురస్కారాలను గెలుచుకుంది.
శన్వి తెలుగులో నటించి చాలా కాలం అయ్యింది. ఈ బ్యూటీకి కన్నడలో కూడా ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు.
శాన్వి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటూ, తన అభిమానులను ఆకట్టుకుంది.