- Telugu News Photo Gallery Cinema photos Year Ender 2024, these actresses entered in Tollywood from Janhvi Kapoor to Bhagya Sri Borse
Year Ender 2024: ఈ ఏడాది టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్.. జాన్వీ నుంచి భాగ్యశ్రీ వరకు..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇతర భాషలకు చెందిన నటీమణులు ఎంట్రీ ఇవ్వడం కామన్. 2024లో బాలీవుడ్ తోపాటు తమిళం, మలయాళం భాషలకు చెందిన పలువురు ముద్దుగుమ్మలు తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు. అందులో కొందరు హిట్స్ ఖాతాలో వేసుకుంటే.. మరికొందరు ఫస్ట్ మూవీతో డిజాస్టర్స్ అందుకున్నారు.
Updated on: Dec 18, 2024 | 12:03 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఇక పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన చిత్రాల్లో దేవర ఒకటి. ఈ సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అలాగే సినిమా విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది భాగ్య శ్రీ బోర్సే. రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

యంగ్ హీరో నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో రుక్మిణికి పాపులారిటీ రాలేదు.

ఈ ఏడాది రెండు సక్సెస్ లు ఖాతాలో వేసుకుంది నయన్ సారిక. ఆయ్, క సినిమాలతో హిట్స్ అందుకుంది. అంతకు ముందు ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేషా సినిమాలో నటించింది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మానుషి చిల్లార్.కానీ ఈ సినిమా అంతగా హిట్ కాలేదు.




