- Telugu News Photo Gallery Cinema photos Know Keerthy Suresh Remuneration For Baby John Movie in Bollywood
Keerthy Suresh: హిందీలో ఫస్ట్ మూవీ.. రెమ్యునరేషన్ పెంచేసిన కీర్తి సురేష్.. ఎన్ని కోట్లంటే..
దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Dec 18, 2024 | 10:15 AM

హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

డిసెంబర్ 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనితో కలిసి ఏడడుగులు వేసింది. వీరి పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. కీర్తి సురేష్, ఆంటోని పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వస్తుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

బేబీ జాన్ సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటివరకు కీర్తి నటించిన సినిమా పెద్దగా హిందీలో రిలీజ్ కాలేదు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగతున్నాయి. అయితే ఈ సినిమా కోసం కీర్తి భారీగానే డిమాండ్ చేస్తుందట.

బేబి జాన్ సినిమాకు కీర్తి సురేష్ ఏకంగా రూ.4కోట్ల పారితోషికం తీసుకుంటుంది. తమిళంలో విజయ్ దళపతి నటించిన తేరీ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఇదే సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి దర్శకుడు అట్లీ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




