- Telugu News Photo Gallery Cinema photos New doubts have been raised with the announcement of People Media Factory's Hindi movie
People Media Factory: రాజా సాబ్ వాయిదా పడుతుందా.? పీపుల్ మీడియా చేసిన పనితో న్యూ డౌట్స్.?
రాజా సాబ్ అనుకున్న సమాయానికి వస్తుందా..? హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ చెప్పిన టైమ్‌కు విడుదలవుతుందా..? అసలు ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి మీకు అనుకుంటున్నారు కదా..? దీనికి కారణం ఉంది.. తాజాగా ఓ హిందీ సినిమా అనౌన్స్‌మెంట్‌తో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఏంటా సినిమా.. ఎందుకు ఈ డౌట్స్..? అన్నీ చూద్దాం పదండి..
Updated on: Dec 18, 2024 | 9:10 AM

ఎప్రిల్ 10 ఎప్పుడెప్పుడు వస్తుందా.. రాజా సాబ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 400 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తుంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మరో పాన్ ఇండియన్ సినిమా మిరాయ్. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా ఇందులో హీరో. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎప్రిల్ 18న విడుదల చేస్తామని చెప్పారు.

తాజాగా సన్నీ డియోల్ జాట్ సినిమా సైతం ఎప్రిల్‌లోనే విడుదల అంటూ ప్రకటించారు. ఈ సినిమాకి బాలీవుడ్ సినిమాకి తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. దీన్ని నిర్మిస్తున్నది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే.

2025, ఎప్రిల్‌లో ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి మూడు సినిమాలు ప్రకటించారు. అయితే ఇందులో కచ్చితంగా ఒక సినిమా అయితే వాయిదా పడుతుందని తెలుస్తుంది. అది రాజా సాబా, మిరాయా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

మరోవైపు ఈ రెండింట్లో ఏది వాయిదా పడినా.. ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో వస్తున్న విశ్వంభర విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఎప్రిల్ 2025 పోరు రసవత్తరంగా మారింది.




