- Telugu News Photo Gallery Cinema photos Year ender 2024 heroines sreeleela and meenakshi choudary did the most movies and stayed in trend, details here
Sreeleela vs Meenakshi: శ్రీలీల vs మీనాక్షి చౌదరి.! ఈ ఏడాది వీళ్లే ట్రేండింగ్ ఆ.!
ఇప్పుడంటే శ్రీలీల బజ్ కాస్త తగ్గింది కానీ, లాస్ట్ ఇయర్ చూడాల్సింది ఆమె స్టేటస్‌ని. ఏస్టార్ హీరో సెట్‌లో చూసినా ఆమే కనిపించేది. ఈ ఏడాది సేమ్ సీన్ మీనాక్షి చౌదరి విషయంలో రిపీట్ అయింది. వీరిద్దరి కెరీర్లను పోల్చి చూస్తూ కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు వెల్ విషర్స్. ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్.. బుల్లెట్ దిగిందా? లేదా? అని కాస్త మాస్‌గానే అంటున్నారు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల. అందం ఉంది, మంచి పెర్ఫార్మర్ అనే పేరుంది..
Updated on: Dec 18, 2024 | 7:19 PM

ఇప్పుడంటే శ్రీలీల బజ్ కాస్త తగ్గింది కానీ, లాస్ట్ ఇయర్ చూడాల్సింది ఆమె స్టేటస్‌ని. ఏస్టార్ హీరో సెట్‌లో చూసినా ఆమే కనిపించేది.

ఈ ఏడాది సేమ్ సీన్ మీనాక్షి చౌదరి విషయంలో రిపీట్ అయింది. వీరిద్దరి కెరీర్లను పోల్చి చూస్తూ కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు వెల్ విషర్స్ .

ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్.. బుల్లెట్ దిగిందా? లేదా? అని కాస్త మాస్‌గానే అంటున్నారు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల. అందం ఉంది, మంచి పెర్ఫార్మర్ అనే పేరుంది.. స్పీడు స్టెప్పులకి, గ్లామర్ రోల్స్ కీ కేరాఫ్ అవుతారనుకుంటే ఎందుకు గ్యాప్ తీసుకున్నారని ఆ మధ్య శ్రీలీల విషయంలో తెగ ఫీలయిపోయారు ఫ్యాన్స్.

ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల లక్షణాలన్నీ ఆమెలోనే చూసుకుంటారు వెల్‌విషర్స్. ఇంత క్రేజ్ ఉన్నా కెరీర్‌కి శ్రీలీల కామా ఎందుకు పెట్టారన్నది అందరి డౌట్. మెడిసన్‌లో ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అక్కడ కాన్‌సెన్‌ట్రేట్ చేయాల్సి వచ్చిందన్నది ఈ బ్యూటీ ఇచ్చిన స్టేట్‌మెంట్.

చదువు కోసం అయితే ఫర్లేదుగానీ, ఫ్యూచర్‌లో మాత్రం ఇంతింత గ్యాప్ తీసుకోకండి అని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ శ్రీలీల ఎంత బిజీగా ఉన్నారో, ఈ ఏడాది మీనాక్షి చౌదరి కూడా అంతే హెక్టిక్ షెడ్యూల్స్ చేశారు.

ప్రతి రెండు నెలలకీ ఓ సారి ఏదో ఓ సినిమాతో పలకరిస్తూనే ఉన్నారు మీనాక్షి. లక్కీ భాస్కర్‌లో చిన్న బాబుకి తల్లిగా నటించారు మీనాక్షి. కెరీర్ పీక్స్ మీదున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని సలహాలు అందుతున్నాయట ఆమెకి.

చిన్నప్పటి నుంచి నాన్న నేర్పిన డిసిప్లిన్, స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిగర్‌ని మెయింటెయిన్ చేయడానికి యూజ్ అవుతోందని.,

దాని వల్ల సినిమా కెరీర్‌కి చాలా ప్లస్ అవుతోందని అంటున్నారు ఈ బ్యూటీ. ఫ్యూచర్‌లో ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తానని అంటున్నారు మిస్ మీనాక్షి.




