- Telugu News Photo Gallery Cinema photos Will vijay teri movie success to ustad bhagat singh and baby john
Pawan Kalyan: పవర్‌స్టార్ మీద భారం పెట్టిన జవాన్ కెప్టెన్
ఆల్రెడీ ఒక లాంగ్వేజ్‌లో హిట్ అయిన సినిమాలు ఇంకో లాంగ్వేజ్‌లో డీఫాల్ట్ గా హిట్ అయిపోవాలనేం లేదు. కాకపోతే, ప్రూవ్ చేసుకున్న సబ్జెక్టులు కాబట్టి పాజిటివ్ వైబ్స్ అయితే బలంగానే ఉంటాయి. అలా కోలీవుడ్‌లో క్లిక్ అయిన తెరికి సెట్స్ మీదున్న వెర్షన్స్ గురించి సరదాగా గుర్తుచేసుకుంటున్నారు మూవీ లవర్స్... ఇంతకీ ఏవిటా సినిమాల ప్రోగ్రెస్ రిపోర్ట్? విజయ్, సమంత జోడీగా నటించిన తెరి సినిమాను తమిళ తంబిలు అంత తేలిగ్గా మర్చిపోలేరు.
Updated on: Apr 27, 2024 | 8:12 PM

ఆల్రెడీ ఒక లాంగ్వేజ్‌లో హిట్ అయిన సినిమాలు ఇంకో లాంగ్వేజ్‌లో డీఫాల్ట్ గా హిట్ అయిపోవాలనేం లేదు. కాకపోతే, ప్రూవ్ చేసుకున్న సబ్జెక్టులు కాబట్టి పాజిటివ్ వైబ్స్ అయితే బలంగానే ఉంటాయి. అలా కోలీవుడ్‌లో క్లిక్ అయిన తెరికి సెట్స్ మీదున్న వెర్షన్స్ గురించి సరదాగా గుర్తుచేసుకుంటున్నారు మూవీ లవర్స్... ఇంతకీ ఏవిటా సినిమాల ప్రోగ్రెస్ రిపోర్ట్?

విజయ్, సమంత జోడీగా నటించిన తెరి సినిమాను తమిళ తంబిలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. వారిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, రెండు గెటప్పుల్లో విజయ్, బలమైన ఎమోషన్స్, దుమ్మురేపిన యాక్షన్ సీన్స్.. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఆ సినిమాను కమర్షియల్‌గా టాప్‌లో నిలబెట్టేశాయి.

అట్లీ డైరక్షన్‌లో తెరకెక్కిన తెరి సినిమా నార్త్ లో బేబీ జాన్ పేరుతో రూపొందుతోంది. ఈ సినిమాతోనే సౌత్ సుందరి కీర్తీ సురేష్ బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. వరుస సక్సెస్‌లతో క్లౌడ్‌నైన్‌లో ఉన్న వరుణ్ ధావన్ బేబీ జాన్‌లో హీరోగా నటిస్తున్నారు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది బేబీ జాన్.

ఇటు పవన్ అయినా, అటు మహేష్ అయినా, ప్యాన్ ఇండియా ఎక్స్ పీరియన్స్ ఉన్న కెప్టెన్లతోనే ట్రావెల్ చేయడం చాలావరకు హెల్ప్ అయ్యే విషయం అని ఖుషీ అవుతున్నారు అభిమానులు.

ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీస్‌లో ఉన్న పవన్.. ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చాకే ఈ సినిమా స్క్రీన్స్ మీదకు వచ్చేది. సో.. తమిళ్‌లో విజయ్‌కి సూపర్‌డూపర్ సక్సెస్‌నిచ్చిన తెరి, వరుణ్‌కీ, పవన్‌కీ ఎలాంటి ఫలితాన్నిస్తుందనే ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది.




