- Telugu News Photo Gallery Cinema photos Ranbir Kapoor, Sai Pallavi's first look from Ramayana leaked pics Ramam Raghavam teaser details
వరుస లీకులతో రామాయణ్.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ‘రామం రాఘవం’
కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్.. ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన తెరకెక్కిస్తున్న రామం రాఘవం సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఇది. టీజర్ చూస్తుంటే కామెడీ మాత్రమే కాదు.. బలగం మాదిరి ఎమోషన్‌ను ఎక్కువగానే చూపిస్తున్నారని అర్థమవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ ఎంటర్‌టైనర్ శబరి. మహేంద్రనాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ దర్శకుడు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Apr 27, 2024 | 8:29 PM

Ramam Raghavam: కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్.. ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన తెరకెక్కిస్తున్న రామం రాఘవం సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఇది. టీజర్ చూస్తుంటే కామెడీ మాత్రమే కాదు.. బలగం మాదిరి ఎమోషన్‌ను ఎక్కువగానే చూపిస్తున్నారని అర్థమవుతుంది.

Sabari: వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ ఎంటర్‌టైనర్ శబరి. మహేంద్రనాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ దర్శకుడు. మే 3న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అనగనగా అంటూ సాగే పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేసారు. పాట చాలా అద్భుతంగా ఉందంటూ ఆయన ప్రశంసించారు.

Adah Sharma: అదా శర్మ ప్రధాన పాత్రలో కృష్ణ అన్నం తెరకెక్కిస్తున్న సినిమా CD. క్రిమినల్ ఆర్ డెవిల్ అనేది పూర్తి టైటిల్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విశ్వంత్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సిడి సినిమా వస్తుంది. తనకు తెలుగులో ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు అదా శర్మ.

Vishal: విశాల్ హీరోగా హరి తెరకెక్కించిన సినిమా రత్నం. తెలుగు, తమిళంలో ఏప్రిల్ 26న విడుదలైంది ఈ చిత్రం. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన రత్నంకు మంచి రెస్పాన్స్ వస్తుందంటూ ఆనందం వ్యక్తం చేసారు విశాల్. తెలుగు, తమిళంలో దీనికి మంచి ఆదరణ దక్కుతుందన్నారాయన. కుటుంబంతో పాటు సమ్మర్‌లో చూసే మంచి సినిమా రత్నం అని తెలిపారు విశాల్.

Ramayana: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా రామాయణ్. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం లొకేషన్స్ నుంచి కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. రాముడిగా రణ్‌బీర్, సీతమ్మ తల్లిగా సాయి పల్లవి కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా యశ్ నటిస్తున్నారని తెలుస్తుంది.





























