- Telugu News Photo Gallery Cinema photos Will vicky kaushals chhaava moive careate collection in tollywood
Chhaava: ఛావా తెలుగు వెర్షన్ విడుదల.. టాలీవుడ్ లో వర్కవుట్ అవుతుందా
ఛావా తెలుగు వర్షన్ వర్కవుట్ అవుతుందా..? ఇప్పటికే మూడు వారాలైంది ఈ సినిమా విడుదలై..! పైగా 500 కోట్లకు పైగా వసూలు చేసింది కూడా.. ఇలాంటి సమయంలో తెలుగు వర్షన్ విడుదలవుతుంది. మరి ఏ నమ్మకంతో ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తుంది గీతా ఆర్ట్స్..? వాళ్ల ప్లాన్ ఏంటి..? అసలు ఛావా తెలుగు వర్షన్ ఎలా ఉండబోతుంది..?
Updated on: Mar 05, 2025 | 11:54 AM

మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో పేరు వినిపించడం లేదు.. ఛావా తప్ప. పుష్ప 2 తర్వాత సైలెంట్ అయిపోయిన బాలీవుడ్‌కు ప్రాణం పోసిన సినిమా ఇదే.

ఇప్పటికే 3 వారాల్లో వరల్డ్ వైడ్‌గా 600 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా వచ్చిన ఛావాకు అన్నిచోట్లా అదిరిపోయే స్పందన వచ్చింది.

లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఛావా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. శంభాజీ సతీమణి ఏసూ బాయిగా రష్మిక మందన్న నటించారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులతో పాటు.. ఎమోషన్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి.

ముఖ్యంగా క్లైమాక్స్‌కు థియేటర్స్ నుంచి వస్తూ అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతటి రెస్పాన్స్ వస్తున్న సినిమాను రీజినల్ లాంగ్వేజెస్‌లోకి తీసుకురావాలనే డిమాండ్ విడుదలైన రోజు నుంచే వినిపిస్తుంది. తాజాగా గీతా ఆర్ట్స్ ఇదే చేస్తున్నారు.

మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ వస్తుంది. డబ్బింగ్ కూడా ఏదో చేసామన్నట్లు కాకుండా.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.. ఈ వారం సినిమాలేం లేకపోవడం ఛావాకు కలిసొచ్చే అంశం.




