- Telugu News Photo Gallery Cinema photos Varalakshmi Sarathkumar celebrates her birthday with orphan children
varalakshmi Sarathkumar: అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్..
తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈసినిమా తర్వాత వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది
Updated on: Mar 04, 2025 | 11:51 PM

లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది ఈ బ్యూటీ. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది .

తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఈసినిమా తర్వాత వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ తమిళ్ లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ బ్యూటీ.

నికోలాయ్ సచ్ దేవ్‌ను అనే వ్యక్తిని వరలక్ష్మీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది వరలక్ష్మీ.. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.

తాజాగా వరలక్ష్మీ తన పుట్టిన రోజును అనాధ పిల్లలతో కలిసి జరుపుకుంది. భర్త నికోలాయ్ సచ్ దేవ్ తో కలిసి వరలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకుంది. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




