- Telugu News Photo Gallery Cinema photos Oscar awards completed without any indian films know the reasons why
ఇండియన్ సినిమాలేం లేకుండానే ముగిసిన ఆస్కార్ ఈవెంట్.. కారణం అదేనా
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. రెండేళ్ల కింద మన ట్రిపుల్ ఆర్ ఉంది కాబట్టి అలారం పెట్టుకుని మరీ ఆస్కార్ గురించా ఆరా తీసారు మనోళ్లు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాలేం లేకుండానే ఈ ఈవెంట్ ముగిసింది. మరి ఈ సారి ఆస్కార్‌లో ఉత్తమ నటుడెవరు..? సినిమా ఏంటి..? అసలు అవార్డుల ముచ్చట్లేంటో చూద్దామా..?
Updated on: Mar 04, 2025 | 8:45 PM

లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓబ్రియాన్ హోస్ట్‌గా వ్యవహరించారు.

ఈ సారి ఇండియన్ సినిమాలేవీ రేసులో లేవు. ఉత్తమ నటుడుగా ది బ్రూటలిస్ట్ సినిమాకు గానూ అడ్రియన్ బ్రాడీ.. నటిగా అనోరా సినిమాకు మైకీ మాడిసన్ ఎంపికయ్యారు.

ఈ సారి అకాడమీ అవార్డుల్లో అనోరా సినిమా సత్తా చూపించింది. ఉత్తమ నటితో పాటు ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లోనూ అనోరాకు అవార్డులొచ్చాయి.

ఇది ఓ వేశ్య కథ. చదువు కోసం USA వచ్చిన ఒక రష్యన్ కోటీశ్వరుడు 23 ఏళ్ల వేశ్యతో ప్రేమలో పడతాడు.. వాళ్ళ పెళ్లికి కుటుంబం ఒప్పుకోదు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

ఉత్తమ సహాయ నటుడుగా ది రియల్ పెయిన్‌లో నటనకు గానూ కీరన్ కైల్ కల్కిన్, ఉత్తమ సహాయ నటిగా ఎమిలియా పెరేజ్ సినిమాకు జోయా సాల్దానా, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో డ్యూన్: పార్ట్2, బెస్ట్ యానిమేటెడ్ సినిమాగా ఫ్లో, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్ సినిమాలు నిలిచాయి.




