- Telugu News Photo Gallery Cinema photos Will ram charan be a number one tollywood hero with his new movies
Ram Charan: రామ్ చరణ్ మాస్ ప్లానింగ్.. వర్కవుట్ అయితే టాప్ చైర్ చెర్రీదే
తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కానీ రామ్ చరణ్ మాస్ ప్లానింగ్ చూస్తుంటే.. ఆయనే నెంబర్ వన్ అవుతారేమో అనిపిస్తుంది. అదేంటి అంత పెద్ద మాట అనేసారు..? అంత బలంగా ఎలా చెప్తున్నారు అనుకోవచ్చు.. కానీ ఒక్కసారి ఈ స్టోరీ చూసేయండి మీకే క్లారిటీ వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మాస్టర్ ప్లానింగ్ మామూలుగా లేదు. రాజమౌళి పుణ్యమా అని పాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్న చరణ్.. దాన్ని గ్లోబల్‌కు ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారు.
Updated on: Mar 23, 2024 | 8:07 PM

తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కానీ రామ్ చరణ్ మాస్ ప్లానింగ్ చూస్తుంటే.. ఆయనే నెంబర్ వన్ అవుతారేమో అనిపిస్తుంది. అదేంటి అంత పెద్ద మాట అనేసారు..? అంత బలంగా ఎలా చెప్తున్నారు అనుకోవచ్చు.. కానీ ఒక్కసారి ఈ స్టోరీ చూసేయండి మీకే క్లారిటీ వస్తుంది.

ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మాస్టర్ ప్లానింగ్ మామూలుగా లేదు. రాజమౌళి పుణ్యమా అని పాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్న చరణ్.. దాన్ని గ్లోబల్‌కు ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సెలెక్ట్ చేసుకుంటున్న కథలు.. పిక్ చేసుకుంటున్న దర్శకులు కూడా అలాగే ఉన్నారు.

ఇవన్నీ వర్కవుట్ అయితే దెబ్బకు చరణ్ నెంబర్ వన్ అవ్వడం ఖాయం. గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రామ్ చరణ్. దీనికి దర్శకుడు శంకర్ కాబట్టి.. ఎలాగూ ఆ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమాతో తమిళంలోనూ చరణ్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం.

బుచ్చిబాబుతో తాజాగా ఓ సినిమా మొదలుపెట్టారు. ఇది కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్టే. ఏఆర్ రెహమాన్ ఎంట్రీతో గ్లోబల్‌గా RC16 పేరు మార్మోగిపోతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భారీగానే RC16ను ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌లోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు చరణ్.

మార్చి 27న ఈ చిత్రంపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇక RC18 మళ్లీ రాజమౌళితోనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. మహేష్ తర్వాత చరణ్ వైపు చూస్తున్నారు జక్కన్న. ఇవన్నీ వర్కవుట్ అయితే వద్దన్నా.. చరణ్ చెంతకు టాప్ చైర్ వచ్చేస్తుంది.




