- Telugu News Photo Gallery Cinema photos Will Rajinikanth's Jailer movie release in OTT in the last week of September
Jailer OTT : సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జైలర్.. ఓటీటీ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?
మొదటి షో నుంచే జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. రెండు చోట్ల ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. సన్ పిక్చర్స్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ జైలర్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది.
Rajeev Rayala | Edited By: Ravi Kiran
Updated on: Aug 10, 2023 | 9:02 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియటర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసిన జైలర్ మూవీ సందడే కనిపిస్తుంది.

మొదటి షో నుంచే జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. రెండు చోట్ల ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. సన్ పిక్చర్స్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది.

ఇక ఏ సినిమా ఓటీటీ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జైలర్ ఓటీటీ పార్ట్‌నర్‌ని ఫిక్స్ చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ జైలర్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. నెలరోజుల తర్వాత అంటే సెప్టెంబర్ చివరి వారంలో జైలర్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.





























