Tollywood News: బిగ్ స్క్రీన్ మీద ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్.. డాన్‌కు జోడిగా కియారా
రజనీకాంత్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన జైలర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాట అర్ధరాత్రే ఫ్యాన్ షోస్ మొదలయ్యాయి. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ రోజు నుంచి కెప్టెన్ మిల్లర్ టీజర్‌ను బిగ్ స్క్రీన్స్ మీద ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా వెల్లడించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
