- Telugu News Photo Gallery Cinema photos Will Bollywood heroine Kangana Ranaut enter into politics Soon
Kangana Ranaut: రాజకీయాల్లోకి కంగనా ఎంట్రీ.? ఇదే సరైన సమయం అంటున్న నటి..
కంగనా అంటే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ అంటే కంగనా..! సినిమాల్లో ఉన్నపుడే ఈమె వివాదాలకు ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది. అలాంటి హీరోయిన్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..! కొంపదీసి వస్తున్నారా ఏంటి అనుకుంటున్నారు కదా.? కొంపదీయకుండానే వచ్చేస్తున్నారు. మరి కంగనా పాలిటిక్స్ గురించి కాసేపు మాట్లాడుకుందామా..!
Updated on: Feb 29, 2024 | 2:35 PM

వివాదాలకు దగ్గరగా ఉండే హీరోయిన్లలో కంగనా రనౌత్ పేరు ముందుంటుంది. ఈమె సినిమాలే కాదు.. మాటలు కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఎమర్జెన్సీ సినిమాతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఈ బ్యూటీ. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ టైమ్ నేపథ్యంతో ఈ చిత్రం వస్తుంది. దీనికి ఆమె దర్శకురాలు, నిర్మాత కూడా.

కంగనా పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లు చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగన రనౌత్.. తన రాజకీయ రంగప్రవేశంపై ఓపెన్ అయ్యారు కంగనా రనౌత్.

ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఇదే సరైన సమయం అన్నారామె. దేశంలోని అన్ని ప్రాంతాలతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.

దేశం నాకు చాలా ఇచ్చింది.. నేను దేశానికి తిరిగిచ్చేస్తానంటున్నారు కంగనా. కొన్నేళ్లుగా BJPపై ఈమె ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె వస్తానంటే పార్టీ స్వాగతిస్తుందని BJP అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలిపారు.

తన పొలిటికల్ ఎంట్రీ కోసమే ఎమర్జెన్సీ లాంటి వివాదాస్పద సినిమాను చేస్తున్నారేమో అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తానికి చూడాలిక.. కంగనా పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందో..?




