- Telugu News Photo Gallery Cinema photos Tamil heroes are coming up with a new plan for making movies
Tamil Heroes: కొత్త ప్లానింగ్‌తో దూసుకొస్తున్న తమిళ హీరోలు.. ఆ ప్లాన్ ఏంటి..?
ప్రపంచం అంతా ఓ వైపు వెళ్తుంటే.. తమిళ హీరోలు మాత్రం ఓ వైపు వెళ్తుంటారు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా అంటూ పరుగులు తీస్తుంటే.. వాళ్లు మాత్రం బావిలో కప్పల్లా అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతకాలం అని అలా ఉంటారు చెప్పండి..? అందుకే మార్పు మొదలైంది. దానికోసం కొత్త ప్లానింగ్‌తో దూసుకొస్తున్నారు. మరి తమిళ హీరోలు చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి..?
Updated on: Feb 29, 2024 | 2:06 PM

ఇన్నాళ్లూ కేవలం తెలుగు, తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న అరవ హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలోనే రజినీ, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్‌తో పని చేస్తున్నారు.

జ్ఞానవేల్‌తో వెట్టైయాన్ సినిమా పూర్తయ్యాక.. లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు రజినీ. తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజినీ సినిమా కన్ఫర్మ్ అయింది. దీని తర్వాత సాజిద్ సినిమా ఉండబోతుంది.

మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రాతో కర్ణ అనే భారీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.

రాంఝ్నాతో తనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్‌తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. తమిళంలో పాటు హిందీ, తెలుగులోనూ వరస సినిమాలు చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.

మరోవైపు శివకార్తికేయన్ సైతం ఈ మధ్యే ఓ బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథ విన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మొత్తానికి టాలీవుడ్‌కు ధీటుగా ఎదగాలంటే.. బాలీవుడ్‌లో జెండా పాతాల్సిందే అని ఫిక్సైపోయారు తమిళ హీరోలు. మరి వీళ్ల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.




